Vijayawada Durgamma: బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం

Vijayawada Durgamma: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక శోభ వెల్లవిరిసింది. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. అమ్మ వారి ప్రత్యేక దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందారు.

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని దుర్గమ్మకు బంగారు బోనాన్ని సమర్పించినట్లు హైదరాబాద్‌ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ ప్రతినిధులు తెలిపారు. ముందుగా విజయవాడ పాతబస్తీలోని జమ్మిదొడ్డిలో అమ్మవారికి పూజలు చేశారు. అక్కడి నుంచి డప్పులు, కోలాటాల మధ్య దుర్గమ్మ ఆలయం వరకు ఊరేగింపు సాగింది.