National
Vijay: లంచాలను ఈఎంఐల్లాగా తీసుకున్నారు : సీఎం విజయ్
CM Vijay: తమిళనాడు అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ప్రతిపక్ష డీఎంకేపై సీఎం విజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రభుత్వ కాంట్రాక్టర్ల నుంచి గతంలో వాయిదాల పద్ధతిలో లంచాలు వసూలు చేశారని ఆయన ఆరోపించారు. బ్యాంకు రుణాలకు ఈఎంఐలు చెల్లించినట్టుగా.. కాంట్రాక్టర్లు కూడా క్రమం తప్పకుండా లంచాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేదని విమర్శించారు.
