National

సీఈసీపై విజిలెన్స్ విచారణ.. కేరళం సర్కార్ ఆదేశం

దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అంశం చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకారం అందిస్తున్నదని, తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లు డిలీట్ చేసే ప్రక్రియలో కేంద్రానికి సీఈసీ జ్ఞానేష్ కుమార్ సాయం చేస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ క్రమంలోనే దేశప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు ‘సత్యాగ్రహ’ దీక్షకు పిలుపునిచ్చారు. ఇదిలాఉండగా, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణకు తాజాగా కేరళం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.2006లో ఆయన కేరళం ప్రజా పనుల శాఖ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా పనిచేశారు. నాడు పలు అవకతవకలకు పాల్పడినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సమగ్ర విచారణ జరపాలని హోంమంత్రి రమేశ్ చెన్నిథాల విజిలెన్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.