సినిమా
Venkey-Trivikram: ‘ఆదర్శ కుటుంబం’ వెనకాల ఎన్టీఆర్!
Venkey-Trivikram: మన టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న రెండు క్రేజీ చిత్రాలలో ‘ఆదర్శ కుటుంబం’ ఒకటి. ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోకి అటు అభిమానుల్లో ఇటు సినీ వర్గాలలో మంచి అంచనాలున్నాయి. కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ సినిమాకి హైప్ తీసుకువచ్చేందుకు ఎన్టీఆర్ తోడవబోతున్నాడు.
