సినిమా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 'వీరోష్' జంట.. ఫొటోలు వైరల్!

 టాలీవుడ్ మోస్ట్ అంటెండ్ అండ్ క్యూటెస్ట్ కపుల్‌.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (వీరోష్) మరోసారి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాత సేవా సమయంలో స్వామివారిని సందర్శించుకున్నారు. తమ ఇలవేల్పును వేడుకుంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వీరికి వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆశీర్వదించి, శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.