తెలంగాణ

Varuna Yagam: వర్షాల కోసం తెలంగాణ ప్రభుత్వం బిగ్‌ప్లాన్.. ముహూర్తం ఖరారు!

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో కరవు పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల వర్షాలు కురుస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా వర్షాలు కురవడంలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఆగస్టు 10వ తేదీన ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో ‘వరుణ యాగం’ నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావం నుంచి విముక్తి కలిగి, కృష్ణా-గోదావరి నదీ పరివాహక ప్రాంతాలతో పాటు రైతాంగం సుభిక్షంగా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ మహా క్రతువును చేపడుతున్నారు. ఈ మహా యాగ నిర్వహణ బాధ్యతలను యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చెందిన ప్రముఖ వేద పండితులు, అర్చకులకు అప్పగించారు.