Spirituality
రేపు చిలుకూరు బాలాజీ ఆలయం ఆధ్వర్యంలో ‘వరుణ జపం’!
రాష్ట్రంలో కరువు ఛాయలు తొలగి, వరుణ దేవుడి కటాక్షం సిద్ధించాలనే సంకల్పంతో చిలుకూరు బాలాజీ దేవాలయం ఒక కీలక వైదిక క్రతువుకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసి, జలాశయాలన్నీ జలకళతో నిండాలని ఆకాంక్షిస్తూ జూలై 21 (మంగళవారం) ఉదయం 8:30 నుంచి 11:00 గంటల వరకు ఉస్మాన్‌సాగర్ (గండిపేట) జలాశయం వేదికగా "వరుణ జపం" నిర్వహించనున్నారు.
