క్రీడలు
కెప్టెన్‌గా వైభవ్: దులీప్ ట్రోఫీలో అరుదైన ఘనత!
భారత యంగ్ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెరీర్‌లో మరొక అరుదైన మైలురాయిని దాటాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్స్ సందర్భంగా కేవలం 15ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే గోల్డెన్ చాన్స్ దక్కించుకున్నాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న ఈ కీలక పోరులో ఈస్ట్ జోన్ సారథి ఇషాన్ కిషన్ అనుకోకుండా గాయపడటంతో, వైస్ కెప్టెన్‌గా ఉన్న వైభవ్ స్టాండింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది.
