International
USA Iran: తగ్గిన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు.. తెరవెనుక రాయబారాలు!
గత కొన్ని వారాలుగా అమెరికా, ఇరాన్‌ల మధ్య తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సైనిక ఘర్షణలకు తాత్కాలికంగా విరామం లభించింది. ఇరు దేశాలు గత మూడు రోజులుగా పరస్పరం దాడులు చేసుకోకపోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కాస్త సడలాయి. అదే సమయంలో, మధ్యవర్తుల ద్వారా పరోక్ష దౌత్య చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ సోమవారం ప్రకటించడంతో సంక్షోభ నివారణ
