International

US Politics: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగంలో ఒక కీలక పరిణామం నమోదైంది. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ బాధ్యతల నుంచి కరోలిన్ లెవిట్ ఈ నెల చివర్లో వైదొలుగుతున్నట్లు ట్రంప్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. పదవికి దూరమైనప్పటికీ, ఆమె ట్రంప్‌కు ముఖ్యమైన సీనియర్ సలహాదారుగా సేవలు అందిస్తూ రిపబ్లికన్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తారని స్పష్టం చేశారు. కేవలం 28 ఏళ్ల పిన్న వయసులోనే వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులై లెవిట్ అరుదైన రికార్డు నమోదు చేశారు. పత్రికా సమావేశాల్లో విలేకరులు అడిగే సంక్లిష్టమైన ప్రశ్నలను నేర్పుగా ఎదుర్కోవడంలో, ట్రంప్ పరిపాలనా నిర్ణయాలను పటిష్టంగా సమర్థించడంలో ఆమె తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందారు.