National

US Midterm Elections: ట్రంప్ వర్సెస్ డెమోక్రాట్లు.. భారత్‌పై ప్రభావం ఎంత?

US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెలువడటంతో వాషింగ్టన్‌లో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. చట్టసభలపై డెమోక్రాట్లు నియంత్రణ సాధించడంతో వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష దూకుడుకు బలమైన కళ్లెం పడినట్లయింది. అయితే, తలొగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ ట్రంప్ ‘వీటో’ క్యాప్‌తో ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపారు. ఒకవైపు దూకుడు ప్రదర్శించే ట్రంప్, మరోవైపు ఆయనకు అడ్డుకట్ట వేసే డెమోక్రాట్లు ఈ ఇద్దరి పోరు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది.ట్రంప్ యంత్రాంగం నిరంతరం తెరపైకి తెచ్చే కఠినమైన వలస విధానాలు అమెరికాలోని భారతీయ టెక్కీలను కలవరపెడుతూనే ఉంటాయి. అయితే, చట్టసభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం వల్ల రిపబ్లికన్ల ఏకపక్ష ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదనలకు అడ్డంకి ఏర్పడుతుంది.