International
Birth tourism: 'బర్త్ టూరిజం'పై అమెరికా ఉక్కుపాదం.. కొత్త వీసా ఆంక్షలు!
అమెరికా పౌరసత్వం కోసం విదేశీయులు ఆ దేశానికి వెళ్లి ప్రసవించే 'బర్త్ టూరిజం' వ్యవహారంపై బైడెన్-ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగం తీవ్ర స్థాయిలో కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశీయులకు అమెరికన్ పౌరసత్వాన్ని వ్యాపారంగా మార్చి విక్రయిస్తున్న వాణిజ్య నెట్‌వర్క్‌లు, మధ్యవర్తులు, ఏజెంట్లపై కొత్త వీసా ఆంక్షలు విధించనున్నట్లు యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో అధికారికంగా ప్రకటించారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలలోని సెక్షన్ 212(a)(3)(C) కింద ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
