National

ప్రధాని కోటు కర్చీఫ్‌ రంగుల అమరికపై రచ్చ.. విపక్షాల ఘాటు విమర్శలు!

భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన దుస్తులు, వాటి రంగుల అమరిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ సరికొత్త వివాదానికి దారితీసింది. వేడుకల ప్రాంగణంలో ప్రధాని మోదీ ధరించిన కోటు పాకెట్ కర్చీఫ్‌లో త్రివర్ణ రంగులు తలకిందులుగా అమర్చబడి ఉన్నాయంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎర్రకోట వేదికపై నుంచి ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో ఆయన జేబులో ఉంచిన కర్చీఫ్‌ రంగుల వరసను గమనిస్తే.. ఎడమ నుంచి కుడికి ఆకుపచ్చ (గ్రీన్), తెలుపు (వైట్), కాషాయం (ఆరెంజ్) రంగులు కనిపిస్తున్నాయి.