తెలంగాణ

తొలిరోజే రచ్చ రచ్చ.. పది నిమిషాల్లోనే వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ!

 తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర నిరసనలు, గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఉదయం 10గంటలకు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ప్రతిపక్షాల ఆందోళనలతో తీవ్ర కలకలం రేగింది. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ప్రారంభించిన పది నిమిషాల వ్యవధిలోనే 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే వాయిదా సమయం ముగిసి గంటకు పైగా సమయం దాటినా తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకపోవడంతో సభ పునఃప్రారంభంపై ఉత్కంఠ నెలకొంది.