వ్యాపారం

UPI చెల్లింపులపై ఛార్జీలు ఖరారు.. ఎంత పేమెంట్ చేస్తే ఎంత ఛార్జీ... (UPI MDR)

UPI ద్వారా పెద్ద మొత్తంలో చెల్లింపులు చేసే వారికి బిగ్ అలర్ట్. రూ.2వేలకు మించిన మర్చంట్ UPI చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ విధించే కొత్త విధానాన్ని NPCI ప్రకటించింది. ఈ కొత్త నిబంధన అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ప్రతి UPI లావాదేవీపై వినియోగదారుడి ఖాతా నుంచి నేరుగా ఛార్జీ కట్ అవుతుందని దీని అర్థం కాదు.

కొత్త విధానం ప్రకారం రూ.2వేలకు మించిన మర్చంట్ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ ఉంటుంది. ఈ లెక్కన రూ.5వేల చెల్లింపుపై రూ.20, రూ.10,000 చెల్లింపుపై రూ.40 ఛార్జీగా లెక్కించబడుతుంది. అయితే ఈ ఛార్జీ ప్రధానంగా మర్చంట్ లావాదేవీలకు (వ్యాపారులకు చేసే పేమెంట్స్) సంబంధించినది. ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి చేసే P2P UPI బదిలీలను ఈ ఛార్జీ పరిధిలోకి తీసుకురాలేదు.