National

UPI Transaction Charges: బాదుడు తప్పదా? యూపీఐ పేమెంట్స్ పై ఛార్జీల గురించి ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు

మన దేశంలో యూపీఐ ద్వారానే పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వాటిపై ఎలాంటి ఛార్జీలు లేవు. ఉచితంగానే పేమెంట్స్ చేసుకుంటున్నారు. అయితే, భవిష్యత్తులో యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్స్ పై ఛార్జీల బాదుడు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ పేమెంట్స్ పై ఫ్యూచర్ లో ఛార్జీలు విధించవచ్చని ఆయన సంకేతం ఇచ్చారు.