తెలంగాణ
దీపావళి వేళ హైదరాబాద్లో అపశృతి.. బాణసంచా కాలుస్తూ 67మందికి గాయాలు!
హైదరాబాద్లో దీపావళి వేడుకల్లో పలు చోట్ల అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. పండుగ సంబరాల్లో భాగంగా బాణసంచా కాల్చే క్రమంలో ప్రమాదాలు జరిగి నగరవ్యాప్తంగా మొత్తం 67మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా టపాసులు పేలే సమయంలో ఎగిరిపడిన నిప్పురవ్వలు, రసాయనాలు పడటంతో పలువురి కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఉండటం నగర ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. గాయపడిన వారంతా నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ కంటి ఆసుపత్రులకు వైద్య చికిత్స కోసం తరలివచ్చారు.
