National

ఎవరెస్ట్ సమీపంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. భారత పర్యాటకుడు మృతి!

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నేపాల్‌లోని ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ ప్రాంతానికి సమీపంలో ఫెరిచే (Pheriche) వద్ద రెండు హెలికాప్టర్లు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. ఈ తీవ్ర ప్రమాదంలో ఒక భారతీయ పర్యాటకుడు ప్రాణాలు కోల్పోగా, మరో విదేశీ పర్యాటకుడు తీవ్రంగా గాయపడ్డారు. పర్వత శ్రేణుల వద్ద హెలికాప్టర్లు ఒకే హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన భయాందోళన కలిగించే వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.