International

ట్రంప్ కొత్త 'హెయిర్‌స్టైల్' హల్‌చల్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన విభిన్నమైన శైలితో వార్తల్లో నిలిచారు. ఇటీవల లాస్ వెగాస్‌లోని రెడ్ రాక్ క్యాసినో ప్రాంగణంలో జరిగిన ఓ రాజకీయ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సరికొత్త హెయిర్‌స్టైల్‌తో ప్రత్యక్షమై అందరి దృష్టిని ఆకర్షించారు. గతంతో పోలిస్తే మరింత ఒత్తుగా, ప్రకాశవంతమైన రంగుతో కనిపిస్తున్న ఆయన జుట్టును చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో ఆయన ఆర్థిక విధానాలపై మాట్లాడినప్పటికీ, అందరి దృష్టి మాత్రం ఆయన జుట్టుపైనే పడింది. ట్రంప్ నూతన లుక్ చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో మీమ్స్, వ్యంగ్యాస్త్రాలతో హోరెత్తించారు. ఆయన విగ్గు ఉపయోగిస్తున్నారంటూ కొందరు హేళన చేయగా, మరికొందరు "ది న్యూ ట్రంప్ హెయిర్ సీరమ్" పేరుతో కృత్రిమ మేధ (AI) వీడియోలను రూపొందించి వైరల్ చేశారు.