National
కాంగ్రెస్ పథకాలను ట్రంప్ కాపీ కొడుతున్నాడు.. డీకే శివకుమార్ వ్యాఖ్యలు వైరల్!
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల హామీలపై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులోని KPCC (కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఆఫీస్ – 'భారత్ జోడో భవన్' లో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను చూసి ప్రపంచ దేశాలు నేర్చుకుంటున్నాయని, చివరికి అమెరికా అధ్యక్షుడు కాబోయే ట్రంప్ కూడా కాంగ్రెస్ పథకాలనే కాపీ కొడుతున్నారని విమర్శించారు.
