International

Trump Escap: క్యాటరింగ్ ట్రక్కులో ట్రంప్ ఎస్కేప్.. ఇరాన్ మీడియా ట్రోలింగ్!

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తుర్కియే పర్యటన సందర్భంగా జరిగిన ఒక విమాన మార్పిడి వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ చేపట్టిన రహస్య ఆపరేషన్ ఆధారంగా ఇరాన్ ప్రభుత్వం, అక్కడి అధికారిక మీడియా ట్రంప్‌ను తీవ్రస్థాయిలో ట్రోల్ చేస్తోంది. ఇరాన్ సైనిక బలగాల దాడి భయంతోనే ట్రంప్ భద్రత కోసం తన అధికారిక విమానాన్ని వదిలేసి, రహస్యంగా వేరే జెట్ లోకి మారాల్సి వచ్చిందని ఇరాన్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య వైరం ముదిరిన తరుణంలో ఈ ఘటన వెలుగులోకి రావడం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.