సినిమా చాన్స్ పేరిట ట్రాప్..యువ డైరెక్టర్ పవన్ సాదినేని చిట్టా పెద్దదే..!
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిని లైంగికంగా వాడుకుని దూరం పెట్టిన విజయవాడకు చెందిన యువడైరెక్టర్ పవన్ సాదినేని గోల్కొండ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే, విచారణలో భాగంగా పలు షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, పవన్ సాదినేనికి ఇదివరకే పెళ్లైయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరికొందరు మహిళలతో సంబంధం ఉన్నట్టు బాధితురాలు ఆరోపించింది. గోల్కొండ ప్రాంతంలో నివసించే యువతి.. 20 ఏళ్లుగా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతూ 2023 నుంచి మంచానికే పరిమితమై ఉంది. కుటుంబ సభ్యులు ఆమెను వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తోంది. ఈమెకు ఏడాది క్రితం పరిచయమైన పవన్.. నాటి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేయడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వైద్య బిల్లులు చెల్లించడం వంటివి చేశాడు. ఆమె ఆరోగ్యం, కెరీర్, ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటానని హామీ ఇచ్చి, మెల్లిగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు.
