క్రైమ్

గణేశ్ ఆగమన్ వేడుకలో అపశ్రుతి.. ఇంజనీరింగ్ విద్యార్థి మృతి!

హైదరాబాద్ నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాకముందే తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్‌లోని రాంనగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించిన ‘గణేశ్ ఆగమన్’ ఊరేగింపు వేడుకల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటలో బద్రీనాథ్ (19) అనే ఒక యువ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. రాబోయే పండుగ వాతావరణం మధ్య ఒక్కసారిగా సంభవించిన ఈ ఘోర దుర్ఘటన స్థానికులను, గణేష్ భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.