తెలంగాణ
Traffic Diversions: హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. 2 రోజులు ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు
Traffic Diversions: బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని ఆగస్టు 9, 10వ తేదీలలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. వాహనదారులు దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న రూట్లలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
