టాలీవుడ్‌ను శాసిస్తున్న పీఆర్ మాఫియా.. పైసల్ ముట్టకపోతే పగబడతారా?
Tollywood : టాలీవుడ్లో ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కథ, కథనం, నటీనటుల ప్రతిభ నిర్ణయించేవి. కానీ ఈరోజుల్లో ఆ పరిస్థితి తలకిందులైంది. ప్రేక్షకుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి సొంతంగా తీర్పు ఇచ్చే లోపే, తెరవెనుక కొందరు సృష్టించే ‘నకిలీ హడావుడి’ సినిమా జాతకాన్ని తారుమారు చేస్తున్నాయి. ఆ కృత్రిమ హైప్‌ను సృష్టిస్తుంది మరేదో కాదు పబ్లిక్ రిలేషన్స్ (PR) వ్యవస్థ. సినిమాను ప్రమోట్ చేయాల్సిన ఏజెన్సీలు ఇప్పుడు ఏకంగా సక్సెస్‌లను, అట్టర్ ఫ్లాప్‌లను డిసైడ్ చేసే స్థాయికి ఎదిగాయన్న చేదు నిజం ఇండస్ట్రీని కుదిపేస్తోంది.అయితే ఇక్కడ ఒక కఠినమైన వాస్తవాన్ని కూడా గుర్తించాలి. పీఆర్ ఏజెన్సీల హంగామా, ప్రమోషన్ల జాతర సినిమాకు మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రమే తీసుకురాగలవు. సినిమాలో విషయం లేకపోతే, ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఫేక్ ట్రెండ్స్ నడిపినా ప్రేక్షకుడు కనికరించడు. అదే టైంలో అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాను ఎంత తొక్కాలని చూసినా, మౌత్ టాక్ ద్వారా అది అఖండ విజయంగా నిలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
సినిమా కళాత్మకతను బజారుకీడ్చి, ‘డబ్బులిస్తే ఒకలా.. ఇవ్వకుంటే మరోలా’ వ్యవహరిస్తున్న ఈ పీఆర్ ఏజెన్సీల తీరు మారకపోతే.. ఇప్పటికే ఓటీటీలు, టికెట్ రేట్లతో కుదేలవుతున్న చిత్ర పరిశ్రమ మరింత సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం.
