ఏపీ
తిరుమలలో భక్తుల కిటకిట.. సర్వదర్శనానికి 24 గంటలు!
కలియుగ వైకుంఠమైన తిరుమల గిరులలో శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం భక్తుల రద్దీ ఒక్కసారిగా వెల్లువెత్తింది. వారాంతపు సెలవులు కావడం, ఇటీవల కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టి వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తిరుమలకు పోటెత్తారు. ఆదివారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించిన తాజా సమాచారం ప్రకారం, స్వామివారి సర్వదర్శనం పొందడానికి భక్తులు సుమారు 24 గంటల పాటు వేచి చూడాల్సి వస్తోంది.
