ఏపీ

Tirumala: శ్రీవారి ద‌ర్శ‌నానికి 24గంట‌లు.. కంపార్ట్‌మెంట్లు దాటి శిలాతోరణం వరకు క్యూలైన్!

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో భక్తుల రద్దీ తీవ్రంగా కొనసాగుతోంది. వరుస సెలవులు, పండగ వాతావరణం నేపథ్యంలో మంగళవారం సైతం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం తిరుమలకు పోటెత్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో, సర్వదర్శనం క్యూలైన్లు ఆలయం వెలుపల ఉన్న శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం, సోమవారం (సెప్టెంబర్ 28) ఒక్కరోజే 84,171 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 4.26 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.