క్రైమ్

Tirumala: తిరుమల ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం.. 15 అడుగుల లోతులో పడిన కారు!..

తిరుమలలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 22వ మలుపు వద్ద అదుపుతప్పిన ఓ కారు పిట్టగోడను ఢీకొట్టి సుమారు 15 అడుగుల లోతులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి.