క్రైమ్

బాలీవుడ్ నటుడికి బెదిరింపు కాల్.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట రూ.5కోట్లు డిమాండ్!

 బాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత తుషార్ కపూర్‌కు రూ.5కోట్లు ఇవ్వాలంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరుతో బెదిరింపు ఫోన్ కాల్ రావడం చిత్రపరిశ్రమతో పాటు ముంబై నగరంలో తీవ్ర అలజడి సృష్టించింది. తాను లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన కీలక సభ్యుడు 'హ్యారీ బాక్సర్' అని పరిచయం చేసుకున్న ఒక ఆగంతుకుడు, అడిగినంత మొత్తం ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.  అయితే ఈ ఘటనపై తక్షణమే రెస్పాండ్ అయిన ముంబై క్రైమ్ బ్రాంచ్ (Mumbai Crime Branch), యాంటీ ఎక్స్టార్షన్ సెల్ విచారణ చేపట్టి, ఇది బిష్ణోయ్ గ్యాంగ్ పేరును వాడుకుని డబ్బు గుంజడానికి చేసిన ఫేక్ (నకిలీ) కాల్ అయి ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చాయి.