తెలంగాణ

దేశాన్ని, రాజ్యాంగ సంస్థలను అవమానిస్తున్నారు: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ ఫైర్!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరుపై భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్ గాంధీ మాట్లాడే భాష ప్రతిపక్ష నేత స్థాయిలో లేదని, ఆయన దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. దేశ ప్రజలు గాంధీ కుటుంబానికి ఎన్నో పదవులు కట్టబెడితే, నేడు అదే కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ దేశాన్ని, రాజ్యాంగ వ్యవస్థలను అపహాస్యంపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించే సైనికులను సైతం కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు.