క్రైమ్
నిమ్స్‌లో లక్ష్మీభాస్కర్ అక్రమాల బాగోతం!
అక్రమాస్తుల కేసులో ఏసీబీ (ACB) అధికారులకు చిక్కిన నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ లక్ష్మీభాస్కర్ లీలలు ఒక్కటొకటిగా బట్టబయలవుతున్నాయి. తాజాగా నిమ్స్(NIMS)లో జరిగిన సంచలన నియామకాల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడమే గగనంగా మారిన తరుణంలో, ఏకంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సభ్యులకు లక్ష్మీభాస్కర్ అక్రమ పద్ధతిలో శాశ్వత (Permanent) ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించినట్లు తాజాగా తేలింది.
