సినిమా
The Paradise-Promotions: ట్రైలర్..మిగతా భాషల్లో ప్రమోషన్స్ లేవు..సినిమా హిట్టవుతుందా?
The Paradise: నేచురల్ స్టార్ నానిని మునుపెన్నడూ చూడని ఓ వింత గెటప్ అండ్ రోల్‌లో చూడబోతున్నాము. ఆ సినిమానే ది ప్యారడైజ్. ఇందులో హీరోయిన్‌గా ఫుల్ ఫాంలో ఉన్న బ్యూటీ కయాదు లోహర్ నటించింది. కీలక పాత్రల్లో కలెక్షన్స్ కింగ్ మోహన్ బాబు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కనిపించబోతున్నారు. కీర్తి సురేష్ స్పెషల్ నంబర్‌లో అలరించబోతోంది. దసరా లాంటి కల్ట్ క్లాసిక్‌ని తీసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
