సినిమా

జాన్వీ ‘చుట్టమల్లే’ డీప్‌ఫేక్ రగడ.. సెలబ్రిటీల ట్వీట్లపై ఆర్జీవీ చురకలు!

 ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని 'చుట్టమల్లే' పాట డీప్‌ఫేక్ వీడియో వివాదంపై సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో ‘ఎక్స్’లో స్పందించారు.  ఈ అభ్యంతరకర వీడియోపై స్పందించిన సినీ ప్రముఖులు, న్యాయం చేయకపోగా దానికి అనవసర ప్రచారం కల్పించారని తీవ్ర విమర్శలు చేశారు. సెలబ్రిటీల వరుస ట్వీట్ల వల్లే ఈ వీడియో గురించి తెలియని కోట్లాది మంది కూడా దాని కోసం వెతికి చూసేలా చేశారని చురకలంటించారు. ఇది బాధితురాలికి మరింత నష్టం కలిగించడమేనని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.