తెలంగాణ
ఆషాఢంలో గోరింటాకు, గాజుల పండుగ.. సంప్రదాయం వెనుక ఆరోగ్య రహస్యాలు!
హిందూ సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించకపోయినప్పటికీ, లక్ష్మీదేవి, గ్రామదేవతల ఆరాధనతో పాటు 'గోరింటాకు, గాజుల పండుగ'ను మహిళలు ఎంతో కోలాహలంగా జరుపుకుంటారు. తరతరాలుగా వస్తున్న ఈ ఆచారం కేవలం ఒక పండగ లేదా బాహ్య అలంకరణ మాత్రమే కాదు. దీని వెనుక దాగి ఉన్న పురాణ నేపథ్యం, ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలు, శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం..
