క్రీడలు
ధోనీ చెప్పిన ఆ ఒక్క మాటే మా విజయానికి కారణం: వెస్టిండీస్ కెప్టెన్
మొహాలీలోని ముల్లన్పూర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై వెస్టిండీస్ జట్టు అసాధారణ రీతిలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత్ నిర్దేశించిన 352పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 5వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్డే క్రికెట్ చరిత్రలోనే తమ అత్యంత సమర్థవంతమైన, అత్యధిక పరుగుల ఛేదనను విజయవంతంగా సాధించింది. ఈ సంచలన పోరాటంలో వెస్టిండీస్ కెప్టెన్, వికెట్ కీపర్ షాయ్ హోప్ 143బంతుల్లో అజేయంగా 162పరుగులు చేసి ఒంటిచేత్తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ భారీ విజయం అనంతరం విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ మాట్లాడుతూ.. తనకు ఇంతటి ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడేలా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహా ఎంతగానో ఉపయోగపడిందని వెల్లడించాడు.
