తెలంగాణ
TGPSC: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. వారంలో టీజీపీఎస్సీ వరుస నోటిఫికేషన్లు!
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ కీలక ప్రకటన చేసింది. నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ వచ్చే వారం నుంచి వివిధ శాఖల్లోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) వెల్లడించింది. దీనికి అదనంగా, ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడారు.
