తెలంగాణ

శుద్ధి రాజకీయాలు.. కేసీఆర్‌ మౌనంతో మరింత డ్యామేజ్‌..?

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీఆర్‌ఎస్‌ పక్కా వ్యూహ రచనతో ముందుకు వెళ్లింది. బ్లాక్ టీషర్టులు వేసుకొని అసెంబ్లీకి రావడంతో నిరసనకు శ్రీకారం చుట్టింది గులాబీ దళం. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ అధికార పక్షాన్ని నిలదీయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపించింది. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు గులాబీ క్యాంపు‌కు అనూహ్యమైన ఇబ్బందులను తీసుకొచ్చాయి.ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు అందరి దృష్టి గులాబీ బాస్ కేసీఆర్‌ వైపు మళ్లింది. పార్టీ అధినేతగా ఆయన నుంచి స్పష్టమైన స్పందన వస్తుందా? తాతా మధు వ్యాఖ్యలపై ఏదైనా వివరణ ఇస్తారా? ఎర్రవల్లి ఘటనపై పార్టీ వైఖరిని వెల్లడిస్తారా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో అసెంబ్లీ పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది.