తెలంగాణ
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. సీడబ్ల్యూసీ భేటీపై సర్వత్రా ఉత్కంఠ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు.రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు,పార్టీ పరమైన పలు అంశాలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీ వెళ్తున్నట్టు సమాచారం.రాష్ట్రంలో వరుసగా ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి సీఎం ఢిల్లీకి చేరుకుంటారని తెలిసింది. సోమవారం ఉదయం ఢిల్లీలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అనంతరం మంగళవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశానికి ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
