తెలంగాణ
త్వరలో మద్యం ధరల పెంపు.. కొత్త రేట్లు ఎప్పటి నుంచి అంటే..?
తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు భారీషాక్ తగలనుంది. త్వరలోనే అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం కేటగిరీల బ్రాండ్ల ధరల పెంపుపై అధ్యయనం చేసిన ఉన్నతస్థాయి ‘ప్రైస్ ఫిక్సేషన్’ సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్పీ (MRP) సిఫార్సులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. గురువారం అందించిన ఈ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. అన్ని అనుమతులు పూర్తయితే ఆగస్టు 15తర్వాత నుంచి నూతన ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారుల అంచనా.
