తెలంగాణ
TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్
TG: ఖైరతాబాద్ ఉప ఎన్నిక నగారా మోగడానికి మార్గం సుగమమైంది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ సర్కార్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభ కార్యదర్శి తిరుపతి పేరిట సెప్టెంబర్ 26వ తేదీతో ఈ గెజిట్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న దానం నాగేందర్‌పై కోర్టు అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది.
