తెలంగాణ

TG: రైతులకు బిగ్ అప్డేట్.. ఆ 7 రకాల సన్న వడ్లకే రూ.500బోనస్!

తెలంగాణలో సన్న బియ్యం సాగును మరింత ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న ఏడు విశిష్టమైన సన్న వరి రకాలను ప్రభుత్వం గుర్తించి, వాటికి మాత్రమే మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విధివిధానాలకు ఆమోదం లభించడంతో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది. రైతులు తాము పండించిన పంటకు బోనస్ పొందాలంటే ఈ-క్రాప్ (e-Crop) పోర్టల్‌లో నమోదు చేసుకోవడం తప్పనిసరి.