National

కశ్మీర్‌లో ఉగ్రదాడి.. కుల్గాం దాడిలో ఇద్దరు వలస కూలీల మృతి

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడి తీవ్ర విషాదాన్ని నింపింది. కెల్లం ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీ వద్ద పనిచేస్తున్న కూలీలపై శుక్రవారం సాయంత్రం దుండగులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.