తెలంగాణ
Telangana Politics: పరువు తీసుకుంటున్న సీఎం రేవంత్.. పదవి కోసం మరీ ఇంత దిగజారాలా?
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారశైలి మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన 'భారత్ సమ్మిట్', గిగ్ వర్కర్ల ర్యాలీ, సభలో ఆయన ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కార్యక్రమాలకు హాజరైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెంట సీఎం రేవంత్ రెడ్డి చేసిన హడావిడిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ర్యాలీ, సభ ఆద్యంతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చుట్టూ తిరుగుతూ కనిపించారు. అంతేకాకుండా, ఎవరినీ రాహుల్ గాంధీ దగ్గరకు రానీయకుండా "దూరం జరగండి.. దూరం జరగండి" అంటూ స్వయంగా సీఎం అడ్డుకోవడం ఆ దృశ్యాలలో స్పష్టంగా కనిపించింది.
