తెలంగాణ
Telangana: పరాకాష్టకు చేరిన మైనంపల్లి రోహిత్ కుర్ర చేష్టలు!!..
ఒకరు ఎమ్మెల్యే.. ఇంకొకరు పార్టీ అధ్యక్షుడు.. రాజకీయాల్లో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు మాట తీరు, వ్యవహారశైలి కూడా అదే స్థాయిలో ఉండాలి. కానీ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ వ్యవహారం మాత్రం ఇప్పుడు సొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందనే చర్చ మొదలైంది.. తాజాగా ఆర్టీవీ కార్యాలయం వద్ద జరిగిన పరిణామాలు ఈ చర్చకు మరింత ఆజ్యం పోశాయి. తనపై వచ్చిన భూ వ్యవహారాల కథనాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రోహిత్ అక్కడికి వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే మీడియా సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు ఉందా లేదా.. పోలీసులు వెరిఫై చేయాలి అంటూ ప్రశ్నలు సంధించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి..
