తెలంగాణ
Telangana: కవిత కథలు.. మల్లన్న మాటలు ఓట్లు రాబడుతాయా?..
తెలంగాణ రాజకీయాల్లో కొత్త లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. ఒకప్పుడు ఒకే రాజకీయ శిబిరంలో కనిపించిన నాయకులు ఇప్పుడు వేర్వేరు దారుల్లో నడుస్తున్నారు. కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. సామాజిక సమీకరణాల పేరుతో కొత్త నినాదాలు తెరపైకి వస్తున్నాయి. ఈ మొత్తం పరిణామంలో ఎవరి మాటకు ఎంత బలం ఉంది.. ఎవరి వెంట ఎంతమంది నడుస్తారు.. అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రయాణం చర్చకు కారణమవుతోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె తన రాజకీయ వేదికను ప్రత్యేకంగా నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన రాజకీయ వ్యవస్థపైనే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ నాయకత్వం, బీఆర్ఎస్ పాలన, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన అంశాలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి.
