తెలంగాణ
TG : హౌసింగ్ బోర్డు ఇళ్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
తెలంగాణ హౌసింగ్ బోర్డు ఇళ్ల రిజిస్ట్రేషన్ల వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న లబ్ధిదారుల ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని హౌసింగ్ బోర్డుకు స్పష్టం చేసింది. ఇకపై ఏమాత్రం కాలయాపన చేయడానికి వీల్లేదని హెచ్చరిస్తూ.. ఈ నెల 23వ తేదీ లోపే రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని కొలిక్కి తేవాలని కచ్చితమైన డెడ్లైన్ విధించింది.
