తెలంగాణ

TBJP: తెలంగాణ బీజేపీలో మొదలైన గుబులు! ఆ బ్యాచ్‌కు ఉద్వాసన తప్పదా?

TBJP: ఎన్నికలు వచ్చినప్పుడు హడావుడి చేయడం, టికెట్ల కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఆ తర్వాత హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో కూర్చొని టైంపాస్ చేయడం.. తెలంగాణ బీజేపీలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన ఈ 'కంఫర్ట్ జోన్ బ్యాచ్‌'కి హైకమాండ్ ఫుల్‌స్టాప్ పెట్టే దిశగా పావులు కదుపుతోంది. పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని క్షేత్రస్థాయిలో చెమటోడ్చే కార్యకర్తలు ఒకవైపు ఉంటే, ఎలాంటి క్రియాశీల సభ్యత్వం లేకుండా కేవలం పైరవీలు, పైరాయిటీలతో రాష్ట్ర స్థాయి పదవులు అనుభవిస్తున్న నేతలపై అధిష్టానం కన్నెర్ర చేసిందని తెలుస్తుంది. దీంతో రాష్ట్ర కాషాయ దళంలో ఉన్నట్టుండి తీవ్ర గుబులు మొదలైందని జోరుగా చర్చ నడుస్తుంది.తాజాగా జరిగిన రాష్ట్ర పదాధికారుల అంతర్గత భేటీలో అధిష్టానం దూతలు అభయ్ పాటిల్, సంస్థాగత ప్రధాన కార్యదర్శి మధుకర్ వ్యవహరించిన తీరు రాష్ట్ర నాయకులకు నిద్రపట్టకుండా చేస్తోందట. "ఇప్పటిదాకా ఒక లెక్క.. ఇకపై మరో లెక్క" అంటూ వాళ్లు నేరుగా ముఖం మీదే హెచ్చరికలు జారీ చేశారని చెబుతున్నారు.