వ్యాపారం

TCS Data Leak: డేటా లీక్ ఆరోపణలను ఖండించిన టీసీఎస్!

భారతీయ ఐటీ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తమ కంపెనీ అంతర్గత వ్యవస్థల్లో డేటా ఉల్లంఘన లేదా లీకేజీ జరిగినట్లు వస్తున్న ఆరోపణలను తీవ్రంగా తోసిపుచ్చింది. తమ సిస్టమ్స్‌లో గానీ, కస్టమర్ల డేటాకు సంబంధించి గానీ ఎలాంటి అనధికారిక చొరబాటు లేదా భద్రతా లోపాలు సంభవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సంస్థ సోమవారం సాయంత్రం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమర్పించిన అధికారిక నివేదికలో స్పష్టంగా వెల్లడించింది.