తెలంగాణ

HCAలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థను పునరుద్ధరించాలి- TCA డిమాండ్

TCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో రాజ్యాంగబద్ధమైన పాలనను పునరుద్ధరించాలని, జవాబుదారీతనాన్ని అమలు చేయాలని, అలాగే ఏకపక్ష పొడిగింపులు, ఆర్థిక అవకతవకలు, పరిపాలనాపరమైన అవకతవకల వంటి సంస్కృతికి ముగింపు పలకాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA).. కోర్టు నియమించిన ఏకసభ్య కమిటీ (SMC)ని కోరింది. HCA పరిధిని హైదరాబాద్ నగరానికే పరిమితం చేస్తూ, తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిలో TCA చట్టబద్ధమైన పాత్రను గుర్తించడం ద్వారా న్యాయపరమైన ఆదేశాలను SMC కచ్చితంగా పాటించాలంది.