వ్యాపారం

స్విగ్గీ బంపరాఫర్..  థియేటర్ సీటు వద్దకే వేడివేడిగా ఫుడ్ డెలివరీ!

 స్విగ్గీ థియేటర్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. సినిమా హాల్‌లోని మీ సీటు వద్దకే నేరుగా ఫుడ్ డెలివరీ చేసే ప్రత్యేకమైన ‘ఆర్డర్‌-ఇన్‌-సినిమాస్‌’ సేవలను స్విగ్గీ డైన్‌అవుట్ వేదికగా ప్రారంభించింది. సినీపోలిస్, ఏషియన్ సినిమాస్‌ వంటి ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలతో జట్టుకట్టి ఈ ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంటర్వెల్ సమయంలో పాప్‌కార్న్, కూల్‌డ్రింక్స్ లేదా ఇతర స్నాక్స్ కోసం సుదీర్ఘ క్యూలలో వేచి చూడాల్సిన అవసరం లేకుండా, సులభంగా తమకు నచ్చిన పదార్థాలను ఆర్డర్ చేసుకోవచ్చు.